Indin constitution: సెంచరీ కొట్టిన రాజ్యాంగ సవరణలు.. భారత్లో తొలి ఎన్నికలకు ముందే మొదటి సవరణ!
- ఇప్పటి వరకు 103 సవరణలు
- తొలి సవరణ షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం
- చివరిది సామాజిక న్యాయం కోసం
సవరణల్లో భారత రాజ్యాంగం సెంచరీ కొట్టింది. దేశంలో తొలిసారి జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే రాజ్యాంగానికి మొదటి సవరణ చేశారు. 1951లో తొలి సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఆర్థికంగా వెనుకబడినవర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించారు. నాటి నుంచి నేటి వరకు సవరణలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు 103 సవరణలు పూర్తయ్యాయి.
చిట్టచివరి సవరణ సామాజిక న్యాయానికి సంబంధించినది. దీని ప్రకారం.. విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1976లో రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలను చేర్చారు. అలాగే, రాజ్యాంగబద్ధతను ప్రశ్నించాలంటే న్యాయస్థానాలకు కనీస సంఖ్యలో న్యాయమూర్తులు ఉండాలన్న నిబంధనను చేర్చారు. కేంద్రం చేసిన చట్టాలను కొట్టివేయాలంటే రెండింట మూడొంతుల మెజారిటీ ఉండాలన్న నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. కాగా, నేటితో రాజ్యాంగానికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటులో ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది.