Chota K Naidu: నా టాలెంట్ ను ముందుగా దాసరిగారు గుర్తించారు: కెమెరామెన్ చోటా.కె నాయుడు

  • నేను పుట్టిపెరిగింది రామచంద్రపురంలో 
  • పెద్ద పెద్ద కెమెరామెన్లతో పనిచేశాను
  • తొలి సినిమా 'రగులుతున్న భారతం' అని చెప్పిన చోటా

తెలుగులో అనేక చిత్రాలకి చోటా.కె నాయుడు కెమెరా మెన్ గా పనిచేశారు. కొత్త కెమెరామెన్లు చాలామంది వస్తున్నప్పటికీ, సుదీర్ఘకాలంగా ఆ పోటీని తట్టుకుంటూ తనదైన ముద్రను చూపిస్తూ వస్తున్నారు. అలాంటి చోటా.కె నాయుడు తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగింది కాకినాడ దగ్గర 'రామచంద్రపురం'లో. చిత్రపరిశ్రమకి వచ్చిన తరువాత చాలామంది సీనియర్ కెమెరామెన్ల దగ్గర పనిచేశాను. ఎవరు ఎలా లైటింగ్ చేస్తున్నారనే విషయాన్ని ఎక్కువగా పరిశీలించేవాడిని. పెద్ద పెద్ద కెమెరామెన్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నా టాలెంట్ ను ముందుగా గుర్తించిన దాసరిగారు, 'విశ్వామిత్ర' టీవీ సీరియల్ ద్వారా కెమెరా మెన్ గా నాకు అవకాశం ఇచ్చారు. అల్లాణి శ్రీధర్ గారు 'రగులుతున్న భారతం' సినిమాతో నన్ను వెండితెరకి పరిచయం చేశారు. అక్కడి నుంచి ఇప్పటివరకూ నా ప్రయాణం కొనసాగుతూనే వుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News