Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • దర్శకుడు వినాయక్ సరసన శ్రియ!
  • ఉదయ్ కిరణ్ పై బయోపిక్?
  • అయోధ్య అంశంపై కంగన సినిమా 
   *  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న 'సీనయ్య' చిత్రంలో కథానాయికగా ప్రముఖ నటి శ్రియను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
*  ప్రముఖ నటుడు దివంగత ఉదయ్ కిరణ్ జీవితంపై ఓ బయోపిక్ నిర్మాణానికి టాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పాత్రకు గాను యువనటుడు సందీప్ కిషన్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజక్టు చర్చల దశలో వుంది.
*  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అయోధ్య రామమందిరం అంశంపై 'అపరాజిత అయోధ్య' పేరిట రూపొందే చిత్రానికి రచన చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలసి ఆమధ్య 'మణికర్ణిక' చిత్రానికి పనిచేయగా, ప్రస్తుతం 'తలైవి' చిత్రానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు రూపొందే 'అపరాజిత అయోధ్య' చిత్రానికి కంగన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుందట.      
Shriya
V.V.Vinayak
Uday Kiran
Sandip Kishan

More Telugu News