Amaravathi: అమరావతిపై జరుగుతున్న రాజకీయం గురించి మిగతా జిల్లాల వారికి తెలియడంలేదు: రాజధాని ప్రాంత రైతులు

  • తుళ్లూరులో రాజధాని రైతుల సమావేశం
  • ఇటీవలి పరిణామాలపై చర్చ
  • ఆ ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు తుళ్లూరులో ఇవాళ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గత కొన్నివారాలుగా అమరావతి భవితవ్యంపై అనిశ్చితి కలుగజేసే ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో తాము ఎంతో ఆందోళనకు గురవుతున్నామంటూ రైతులు తెలిపారు. దురదృష్టవశాత్తు అమరావతిపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం గురించి ఇతర జిల్లాల వారికి వాస్తవాలు తెలియడంలేదని అన్నారు.

ఏపీ భవిష్యత్ పై విశ్వాసంతో తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని ఎటూ కాకుండా చేయడం వల్ల ఆందోళనలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. భూముల రేట్లు సైతం 30 నుంచి 50 శాతం పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానం అద్భుతమని లండన్ వంటి చోట్ల ఎకనామిక్స్ పీహెచ్ డీలు చేస్తున్న తమ పిల్లలు చెబుతున్నారని, పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభుత్వం కక్షగట్టి దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News