Telugudesam: ‘దత్తపుత్రుడు’ అంటూ పవన్ పై విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు

  • బాబు తనకు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడు
  • చెల్లని కాసు వంటి పార్టీలను బీజేపీ కలుపుకుంటుందా?
  • బీజేపీ అంగీకరిస్తుందో? లేదో? చూడాలి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. నిత్య కళ్యాణం కామెంట్లు చూస్తుంటే బీజేపీలో విలీనానికి తెగ ఆరాట పడుతున్నట్టు తెలిసిపోతోందని,
చంద్రబాబునాయుడు తనకు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడంటూపవన్ పై విమర్శలు చేశారు. ప్రయత్న లోపం లేకున్నా అసలు చెల్లని కాసు పార్టీలను కలుపుకునేందుకు బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలని అన్నారు.
Telugudesam
Nara Lokesh
YSRCP
Vijayasai redddy

More Telugu News