Maharashtra: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయం: మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్

  • మహారాష్ట్రలో బీజేపీకి బల నిరూపణ తప్ప మరో మార్గం లేదు
  • ఉత్తరాఖండ్ లో జరిగిందే మహారాష్ట్రలోనూ పునరావృతం అవుతుంది
  • ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహారాష్ట్రలో బీజేపీకి బల నిరూపణ తప్ప మరో మార్గం లేదని చెప్పారు. గతంలో ఉత్తరాఖండ్ లో జరిగిందే మహారాష్ట్రలోనూ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకు సంపూర్ణమైన మెజారిటీ ఉందని, బీజేపీకి లేదని చెప్పారు.

కాగా, ఏక్ నాథ్ షిండే, అశోక్ చవాన్, జయంత్ పాటిల్ రాజ్ ఈ రోజు రాజ్ భవన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి అధికారులకు వారు ఓ లేఖ సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పారు. గవర్నర్ కు తప్పుడు పత్రాలు చూపించి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జయంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. తాము 162 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ ముందుకు ఎప్పుడు తీసుకురమ్మన్నా తీసుకొస్తామని చెప్పారు. కాగా, ప్రస్తుతం గవర్నర్ కోష్యారీ ఢిల్లీలో ఉన్నారు. 

More Telugu News