kakinada: వీడిన దీప్తిశ్రీ మిస్సింగ్ మిస్టరీ.. సవతి తల్లే నిందితురాలు!

  • స్కూలు నుంచి తీసుకొచ్చి సవతి తల్లి దారుణం
  • నిర్ధారణకు వచ్చిన పోలీసులు
  • మధ్యాహ్నానికి కేసు కొలిక్కి
కాకినాడలో అపహరణకు గురైన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కేసులో మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్టుగానే ఆమె సవతి తల్లి శాంతకుమారి.. చిన్నారిని హత్య చేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు పోలీసులు దాదాపు నిర్ధారించారు. స్కూలు నుంచి చిన్నారిని తీసుకొచ్చిన శాంతకుమారే ఈ దారుణానికి ఒడిగట్టిందని ఓ నిర్ణయానికి వచ్చారు.

చిన్నారి మృతదేహం కోసం రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం కాకినాడ మేడలైను చుట్టూ ఉన్న ఉప్పుటేరులో గాలిస్తోంది. మృతదేహం లభ్యమైతే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని డీఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఈ మధ్యాహ్నానికి కిడ్నాప్ వ్యవహారంలో ఓ కొలిక్కి వస్తుందని ఆయన తెలిపారు.  
kakinada
East Godavari District
deepti sri

More Telugu News