Vijay Devarakonda: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ

  • ఫిలింనగర్ లో విజయ్ కొత్త నివాసం
  • భారీ మొత్తం చెల్లించిన విజయ్!
  • నేడే గృహప్రవేశం!

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండ పేరు ఓ బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. అసలు విషయానికొస్తే, విజయ్ కొత్త ఇంట్లో చేరాడు. హైదరాబాద్ ఫిలింనగర్ లో హీరో శ్రీకాంత్ ఇంటికి దగ్గర్లో ఓ విశాలమైన బంగ్లాను విజయ్ కొనుగోలు చేశాడు. ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. తన కొత్త నివాసం కోసం విజయ్ భారీ మొత్తం చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News