Rakul Preet: అమ్మాయిలను ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లే: రకుల్ ప్రీత్ సింగ్

  • వైజాగ్ లో 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమం
  • హాజరైన రకుల్ ప్రీత్
  • చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కలిగించాలని సూచన

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైజాగ్ లో నిర్వహించిన 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్ మాట్లాడుతూ,  చెడు స్పర్శకు, మంచి స్పర్శకు మధ్య తేడా ఏమిటో చిన్నారి బాలికల్లో అవగాహన కలిగించాలని, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు.

చిన్నవయసు నుంచే అమ్మాయిలకు లైంగిక వేధింపుల పట్ల చైతన్యం వచ్చేలా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని, ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లేనని పేర్కొన్నారు. వారిని ముందే పసిగట్టి తక్షణమే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

More Telugu News