Visakhapatnam District: విశాఖ మన్యంలో బాస్మతి బియ్యం పండిస్తాం: ఏపీ మంత్రి కన్నబాబు

  • ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సాగుచేస్తామని వెల్లడి
  • అనకాపల్లిలో కిసాన్ మేళా
  • ప్రారంభించిన మంత్రి
విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. కిసాన్ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖ మన్యంలో బాస్మతి బియ్యం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బాస్మతి బియ్యం సాగుచేస్తామని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
Visakhapatnam District
Anakapalli
Kisan Mela
Kannababu
Andhra Pradesh
YSRCP

More Telugu News