Chandrakant Patil: శివసేన నాశనం కావడానికి ఆయనే కారణం: సంజయ్ రౌత్ పై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఫైర్

  • ఇప్పటికైనా సంజయ్ మౌనంగా ఉంటే మంచిది
  • ప్రజాతీర్పును శివసేన అపహాస్యంపాలు చేసింది 
  • పలువురు శివసేన ఎమ్మెల్యేలు మాతో రానున్నారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తమ పాత మిత్రుడు శివసేనపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. శివసేనను ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నాశనం చేశారని... ఇప్పటికైనా ఆయన మౌనంగా ఉంటే మంచిదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు.

శివసేన-బీజేపీ కూటమికి మహారాష్ట్ర ప్రజలు 161 ఎమ్మెల్యేలను కట్టబెట్టారని... అయితే ప్రజా తీర్పును శివసేన అపహాస్యంపాలు చేసిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన తొలి మీడియా సమావేశంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శివసేన మాట్లాడటం ప్రారంభించిందని దుయ్యబట్టారు.

మరో బీజేపీ నేత గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ, సంజయ్ రౌత్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వెర్బల్ డయేరియా (అతివాగుడు) అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. సంజయ్ రౌత్ తీరుతో ఎందరో శివసేన ఎమ్మెల్యేలు విసిగిపోయారని... వారు కూడా తమతో పాటు కలిసి నడవాలని భావిస్తున్నారని చెప్పారు.

More Telugu News