Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైనా ఎక్కువ కాలం కొనసాగదు: నితిన్ గడ్కరీ జోస్యం

  • ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సన్నాహాలు
  • స్పందించిన నితిన్ గడ్కరీ
  • ఆ మూడు పార్టీల నడుమ సైద్ధాంతిక విభేదాలున్నాయని వెల్లడి
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరదించేలా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఉరకలు వేస్తున్న కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఎక్కువకాలం నిలవదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆయా పార్టీల నడుమ విభేదాలు కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు.
Maharashtra
BJP
Shivsena
Congress
NCP
Nitin Gadkari

More Telugu News