High Court: 'పౌరసత్వం రద్దు' ఉత్తర్వులపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

  • రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ఇటీవల కేంద్రం ప్రకటన
  • హైకోర్టును ఆశ్రయించిన రమేశ్ 
  • కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను 4 వారాల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు 
  • తదుపరి విచారణ డిసెంబరు 16కి వాయిదా  
తెరాస నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబరు 16కి వాయిదా వేసింది.

కాగా,  చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాదని కొందరు బీజేపీ నేతలు గతంలో కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు  అప్పట్లో స్పష్టం చేసింది. అనంతరం సుప్రీంకోర్టులో కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఈనేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించి, ఆయన భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని ప్రకటన చేసింది.
High Court
Hyderabad

More Telugu News