Hardhik Pandya: వైద్యులకే వైద్యమా?: శిఖర్ ధావన్ పై హార్దిక్ జోక్

  • క్రికెట్ ఆడుతూ గాయపడిన ధావన్
  • వైద్యులతో దిగిన ఫోటో ట్విట్టర్ లో
  • చూసి సరదాగా స్పందించిన హార్దిక్
కాలికి గాయమై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత క్రికెటర్ శిఖర్ ధావన్, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ను చూసిన మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా జోకేశాడు. "హహహ... ఆసుపత్రిలో వైద్యులకే వైద్యాన్ని అందిస్తున్నావా?" అని వ్యాఖ్యానించాడు.

ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన ధావన్, మోకాలి గాయంతో ఆసుపత్రిలో చేరి, అక్కడి డాక్టర్లు, సిబ్బందితో కలిసి దిగిన చిత్రాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్న సంగతి తెలిసిందే. మనం కిందపడినా పైకి లేస్తామని, బాధలను అధిగమించడం మన చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా ధావన్ వ్యాఖ్యానించాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ సానుకూలంగా, సంతోషంగా ఉండాలని సలహా ఇచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ కాగా, హార్దిక్, దానిపై ఇలా సరదా కామెంట్ చేశాడు.
Hardhik Pandya
Sikhar Dhavan
Twitter

More Telugu News