Ramana: ఈజిప్టులో ఏపీ యువకుడికి ఉరిశిక్ష!

  • 2016 ఈజిప్ట్ కు వెళ్లిన రమణ
  • మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ పట్టుబడిన వైనం 
  • క్షేమంగా తేవాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తికి ఈజిప్ట్ కోర్టు ఒకటి ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బగ్గు రమణ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఈజిప్ట్ వెళ్లాడు. 2016లో ఈజిప్ట్ కు వెళ్లిన రమణ, గత సంవత్సరం మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ, పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించిన కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుపై ఈజిప్ట్ దౌత్యాధికారులు, భారత రాయబార కార్యాలయానికి సమాచారాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, రమణకు క్షమాభిక్ష పెట్టించి, ఇండియాకు క్షేమంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని భారత విదేశాంగ శాఖ అధికారులను కోరారు.
Ramana
Rammohan Naidu
Drugs
Egypt

More Telugu News