Vijayasai Reddy: ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు.. కేశినేని నాని ఎద్దేవా!

  • అఖిలపక్ష సమావేశంలో నాకు అవమానం జరిగినట్టు వార్తలు రాశారు
  • నా మర్యాదకు భంగం కలిగించారు
  • ఆ పత్రికల విలేకరులకు పార్లమెంటు పాసులు రద్దు చేయండి
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తనకు అవమానం జరిగినట్టు వార్తలు ప్రచురించారని... తన మర్యాదకు భంగం కలిగించేలా నిరాధార వార్తలను రాశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు పత్రికలకు చెందిన విలేకర్లకు పార్లమెంటు పాసులు రద్దు చేయాలని కోరారు.

ఇదే అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'ఈ గోలంతా ఎందుకు... మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా' అంటూ ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
Eenadu
Andhrajyothy
YSRCP

More Telugu News