ISRO: కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా.. 27కు మార్చిన ఇస్రో

  • ఉపగ్రహాలను అనుసంధానం చేస్తుండగా కనిపించిన లోపం
  • సరిచేస్తున్న శాస్త్రవేత్తలు
  • ప్రయోగాన్ని రెండు రోజులు దూరం జరిపిన ఇస్రో

ఈ నెల 25న ఇస్రో చేపట్టాల్సిన కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా పడింది. రాకెట్ పై భాగంలో ఉష్ణ కవచంతో కప్పి ఉన్న ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్న సమయంలో చిన్నపాటి సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ముందుగా అనుకున్నట్టు ఈ నెల 25న కాకుండా రెండు రోజుల తర్వాత, అంటే 27న ఉదయం 9:28 గంటలకు ప్రయోగం చేపట్టాలని ఇస్రో అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం గుర్తించిన లోపాన్ని శాస్త్రవేత్తలు సరిచేస్తున్నారు.

More Telugu News