Bride came to Marriage Hall by Coffin: ఇదో వెరైటీ పెళ్లి.. శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న వధువు!

  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో
  • కరతాళ ధ్వనులతో స్వాగతించిన బంధువులు, స్నేహితులు
  • వయ్యారంగా శవపేటిక నుంచి లేచి వరుడి చెంతకు వధువు
పెళ్లివేడుకలను వినూత్నంగా జరుపుకోవడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. వధువు లేదా వరుడు పెళ్లి మండపానికి చేరుకునేందుకు పలు వాహనాల్లో వస్తుంటారు. ఉత్తరాదిన గుర్రాలపై వస్తే దక్షిణాదిన స్తోమతను బట్టి పలు వాహనాలను ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో ఈ ట్రెండ్ విభిన్నంగా ఉంటోంది.

తాజాగా ఇందుకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఘనా దేశంలో ఓ పెళ్లి కుమార్తె శవపేటికలో మండపానికి వచ్చి అందరినీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఈ శవ పేటికను కొంతమంది పెళ్లి వేడుక జరిగే ప్రదేశానికి మోసుకొచ్చారు. దానిపై పరచిన నల్లని వస్త్రాన్ని తొలగించి మూతను తెరిచారు. వేడుకలో పాలుపంచుకోవడానికి వచ్చిన బంధువులు, స్నేహితులు చప్పట్లు కొడుతున్న సమయంలో శవ పేటిక నుంచి పెళ్లి కుమార్తె లేచి.. వయ్యారంగా నడుస్తూ వరుడి వద్దకు చేరుకుంది. మీరూ ఈ వీడియో చూడండి.
Bride came to Marriage Hall by Coffin

More Telugu News