Jammu And Kashmir: కశ్మీర్, అయోధ్య అంశాలపై కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించింది: అమిత్ షా

  • కాంగ్రెస్ పై అమిత్ షా విమర్శలు
  • ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం
  • ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందంటూ ఆగ్రహం

కశ్మీర్ వ్యవహారం 70 ఏళ్లుగా నలగడానికి, అయోధ్య కేసులో తీర్పుకు దశబ్దాల సమయం పట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వార్థపూరితంగా వ్యవహరించిందని అన్నారు. ఝార్ఖండ్ లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.

"తన స్వలాభం కోసం కశ్మీర్ అంశాన్ని 70 ఏళ్ల పాటు అనిశ్చితిలో ఉంచింది. అయోధ్య వివాదం న్యాయస్థానంలో ఇన్నాళ్ల పాటు తెమలకపోవడానికి కూడా కాంగ్రెస్సే కారణం. ప్రతి ఒక్కరూ రామమందిరం కోరుకుంటే కాంగ్రెస్ మాత్రం కేసు వ్యవహారంలో కాలయాపన చేసింది. ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసి భరతమాత కిరీటంపై ఉన్న మాలిన్యాన్ని తుడిచేశారు. తద్వారా కశ్మీర్ అభివృద్ధికి బాటలు వేశారు" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News