Rajinikanth: తమిళనాడు ఎన్నికల్లో 'మహాద్భుతం' ఖాయం: రజనీకాంత్

  • రజనీకాంత్ పునరుద్ఘాటన
  • మంత్రి జయకుమార్ వ్యాఖ్యలకు స్పందన
  • కుల, మత, ఆధ్యాత్మిక పార్టీలు మనుగడ సాగించలేవని జయకుమార్ విమర్శ
తమిళనాడులో 2021లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో మహాద్భుతం జరుగుతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ పునరుద్ఘాటించారు. కొన్నిరోజుల క్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన రజనీ మరోసారి అదే విషయాన్ని నొక్కి చెప్పారు. మత, కుల, ఆధ్మాత్మిక పరమైన పార్టీలు తమిళనాడులో ఎప్పటికీ మనుగడ సాగించలేవని రాష్ట్ర మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీ తన పార్టీ ఆధ్యాత్మిక రాజకీయ పంథాలో పయనిస్తుందని అన్నారు. దీనిపైనే జయకుమార్ విమర్శించారు.

అంతకుముందు రజనీ మాట్లాడుతూ, కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యంతో చెలిమి చేసే ఆలోచన ఉందని, మొదట తాను పార్టీ స్థాపించాల్సి ఉందని, ఆ తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తామని తెలిపారు.
Rajinikanth
Kamal Haasan
Tamilnadu

More Telugu News