Ranjan Gogoi: అధికార బంగ్లాను ఖాళీ చేసిన రంజన్ గొగోయ్

  • ఈ నెల 17న రిటైరైన రంజన్ గొగోయ్
  • మూడు రోజుల్లోనే బంగ్లాను ఖాళీ చేసిన మాజీ చీఫ్ జస్టిస్
  • గతంలో వారం రోజుల్లో ఖాళీ చేసిన జేఎస్ ఖేహర్
ఈ నెల 17న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ లోని అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేశారు. రిటైర్ అయిన మూడు రోజుల వ్యవధిలోనే ఒక చీఫ్ జస్టిస్ తన బంగ్లాను ఖాళీ చేయడం ఇదే తొలిసారి. వాస్తవానికి బంగ్లాను ఖాళీ చేయడానికి గొగోయ్ కు ఒక నెల గడువు ఉంది. గతంలో చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేసిన జస్టిస్ జేఎస్ ఖేహర్ కూడా వారం రోజుల్లోనే బంగ్లాను ఖాళీ చేశారు. పదవీ విరమణకు ముందు గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక కేసుల్లో తీర్పులను వెలువరించిన సంగతి తెలిసిందే.
Ranjan Gogoi
Supreme Court
Chief Justice
CJI

More Telugu News