Vijay Rangaraju: 'చంద్రముఖి' సెట్లోకి నేను రావడం చూసి ప్రభు మండిపడ్డాడు: సీనియర్ విలన్ విజయరంగరాజు

  • రజనీకాంత్ గారిని కలవడానికి వెళ్లాను 
  • ప్రభు తన కోపానికి కారణం చెప్పారు 
  • రజనీ ఆత్మీయంగా పలకరించారన్న విజయరంగరాజు  
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ప్రతినాయకుడిగా విజయరంగరాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'భైరవద్వీపం'లో మాంత్రికుడిగా ఆయన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాడు. అలాంటి విజయరంగరాజు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత, రజనీకాంత్ గారిని కలవాలని అనుకున్నాను. 'చంద్రముఖి' షూటింగు జరుగుతున్న లొకేషన్ కి వెళ్లాను. గేట్ దగ్గరున్న సెక్యూరిటీ ఆఫీసర్ నన్ను గుర్తుపట్టి లోపలికి పంపించాడు.

నేను లోపలికి రావడం చూసిన ప్రభుగారు, 'ఎందుకు పంపించారు?' అంటూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ పై మండిపడ్డారు. దాంతో నేను వెనక్కి తిరిగాను. అంతకుముందురోజు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి, జూనియర్ ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టారట. అందువలన ఎవరినీ లోపలికి వదలొద్దని ప్రభు సీరియస్ గా చెప్పారట. ఆ విషయాన్ని ఆయనే చెబుతూ, రజనీ వున్న కారవాన్ లోకి నన్ను పంపించారు. రజనీ నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ సినిమాలో నాకు వేషం ఇప్పించడానికి ప్రయత్నించారుగానీ, అప్పటికే చాలా వరకూ షూటింగు అయిన కారణంగా కుదరలేదు" అని చెప్పుకొచ్చాడు.
Vijay Rangaraju
Rajani
Prabhu

More Telugu News