bus: వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఆత్మహత్య.. తోటి ప్రయాణికులు పట్టుకున్నా విడిపించుకున్న వైనం
- విజయనగరం జిల్లాలో ఘటన
- విశాఖపట్నం వెళుతూ దూకేసిన వ్యక్తి
- అతడి తలపై నుంచి వెళ్లిన లారీ
వేగంగా వెళుతోన్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అతడు బస్సులోంచి దూకాలని చూస్తోన్న విషయాన్ని తోటి ప్రయాణికులు గమనించి అతడిని పట్టుకోవాలని చూసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వైద్యపరీక్షల కోసం ఆ వ్యక్తి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులో వెళుతూ ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డాడు.
విజయనగరంలోని పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద అతడు బస్సులోంచి దూకేయడంతో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి పేరు, వివరాలపై ఆరా తీస్తున్నారు. అతడి వద్ద ఆరోగ్య పరీక్షల రిపోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.