sanjay raut: మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు: సంజయ్ రౌత్

  • డిసెంబరు 1లోపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది
  • ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటాం
  • నిన్నటివరకు కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు జరిగాయి

మహారాష్ట్రకు  ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. డిసెంబరు 1 లోపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  

'ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైంది. డిసెంబరు 1లోపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటాం. నిన్నటివరకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం వద్ద చర్చలు జరిగాయి. తదుపరి రెండు రోజుల పాటు ప్రభుత్వ ఏర్పాటు విషయంపై చర్చిస్తాం' అని సంజయ్ రౌత్ తెలిపారు.

'మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటు, సర్దుబాట్లపై నిర్ణయం తీసుకుంటాయి. శివసేన నేతే మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు' అని సంజయ్ రౌత్ తెలిపారు. 

  • Loading...

More Telugu News