APTIDCO: టిడ్కో రివర్స్ టెండరింగ్ పై అధికారులతో ఏపీ సీఎం సమీక్ష

  •  ప్రధాన టెండర్ల మరుసటి రోజే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచన
  • ఈ రెండు టెండర్ల ప్రక్రియ మధ్య సమయం ఎక్కువగా ఉండొద్దన్న సీఎం
  • ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్  

ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీటిడ్కో) చేపడుతున్న హౌసింగ్ పనులపై రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టిడ్కో పరిధిలో 65,969 ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియను సమీక్షించారు.

కాగా, సమావేశంలో ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్ కు వెళ్తున్నామని అధికారులు వివరించారు. మిగిలిన ఇళ్లకు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. కాగా, ప్రధాన టెండర్ల మరుసటి రోజే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం సూచించారు. ఈ రెండింటి మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని జగన్ పేర్కొన్నారు. దీనిపై అప్రమత్తతతో ఉండాలన్నారు.

More Telugu News