Amani: సౌందర్య వాళ్ల నాన్నగారు నా దగ్గరికి వచ్చి అమర్ ను పెళ్లిచేసుకోమని అడిగారు: సీనియర్ హీరోయిన్ ఆమని

  • సౌందర్య అంటే నాకు ఎంతో ఇష్టం 
  • అమర్ తోను స్నేహం వుంది 
  • ఇద్దరినీ కోల్పోవడం దురదృష్టమన్న ఆమని 
తాజా ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ, సౌందర్యను గురించి ప్రస్తావించారు. "నేను .. సౌందర్య ఇద్దరం బెంగుళూరులోనే ఉండేవాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. మా అలవాట్లు .. అభిప్రాయాలు .. అభిరుచులు చాలా దగ్గరగా ఉండేవి. అందువలన మేము చాలా తొందరగా కలిసిపోయాము.

ఒకసారి ఒక సినిమా షూటింగులో నేను .. సౌందర్య ఇద్దరం వున్నాము. సౌందర్యతో పాటు వాళ్ల నాన్నగారు కూడా వచ్చారు.  సౌందర్య సోదరుడైన 'అమర్'ను పెళ్లి చేసుకోమని అడిగారు. ఆయన ఒక్కసారిగా అలా అడగడంతో నేను షాక్ అయ్యాను. ఆ తరువాత అమర్ లవ్ మేరేజ్ చేసుకున్నాడు. ఆయన కూడా నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. సౌందర్య .. అమర్ వంటి మంచి స్నేహితులను కోల్పోవడం నిజంగా దురదృష్టం. సౌందర్య ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూనే ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
Amani
Soundarya

More Telugu News