Kodali Nani: మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  • హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు
  • విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఫిర్యాదు చేసిన వేమూరి ఆనంద సూర్య
విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడాలి నానిపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్  వేమూరి ఆనంద సూర్య ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతిలో బీజేపీ నేతలు కూడా ఇప్పటికే నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై కొడాలి నాని ఇప్పటివరకు స్పందించలేదు.
Kodali Nani
Andhra Pradesh
TTD

More Telugu News