BSE: భారీ లాభాల్లో రిలయన్స్... సరికొత్త రికార్డుకు స్టాక్ మార్కెట్!

  • 4 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ ఈక్విటీ
  • 300 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • నష్టపోయిన పవర్ సెక్టార్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు నేడు భారత స్టాక్ మార్కెట్ ను సరికొత్త రికార్డు దిశగా నడిపించాయి. రిలయన్స్ సంస్థ ఈక్విటీ విలువ 4 శాతానికి పైగా పెరిగింది. జియో టారిఫ్ లను పెంచనున్నామని సంస్థ నుంచి వచ్చిన ప్రకటనతో ఇన్వెస్టర్లు రిలయన్స్ ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపారని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. భారతీ ఎయిర్ టెల్, కూడా లాభాల్లోనే నడుస్తోంది.

ఈ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 300 పాయింట్లు లాభపడి 40,769 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 83 పాయింట్లు పెరిగి 12,023 పాయింట్ల వద్దా నడుస్తున్నాయి. బీఎస్ఈలో ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, టెలికం, ఇండస్ట్రియల్స్, హెల్త్ కేర్, ఆటో, బ్యాంకెక్స్, కాపిటల్ గూడ్స్ సెక్టార్లు లాభాల్లో నడుస్తున్నాయి. పవర్ సెక్టార్ కంపెనీలు మాత్రం నష్టపోయాయి.

More Telugu News