Kammarajyamlo Kadapa Redlu: 'ఇంకో ఐదేళ్లంటే కష్టమే... మీకు 75 ఏళ్లు వస్తాయి': 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' రెండో ట్రయిలర్ ఇదిగో!

  • ఏపీ ఎన్నికల నేపథ్యంలో చిత్రం
  • సంచలనం కలిగించేలా పలు వాస్తవ పాత్రల డైలాగులు
  • ట్విట్టర్ లో విడుదల చేసిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మరో వివాదాస్పద చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెండో ట్రయిలర్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందన్న సంగతి తెలిసిందే.

"హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి, తమ మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు" అంటూ ప్రారంభమైన ఈ ట్రయిలర్ లో "ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి... ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే..." అన్న డైలాగులు ఉన్నాయి. ఆపై "కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం నాశనం చేశారు" అన్న డైలాగ్, అసెంబ్లీలో వైఎస్ జగన్ పాత్రధారి, చంద్రబాబు పాత్రధారిని హెచ్చరించడం, కొన్ని క్రైమ్ సీన్స్ ఈ ట్రయిలర్ లో కనిపిస్తున్నాయి.

"సినిమాల్లో నటించి, మీకు సేవ చేయడంలో ఉన్న విలువైన కాలాన్ని వృథా చేయనని మీకు హామీ ఇస్తున్నాను" అన్న పవన్ కల్యాణ్ పాత్రధారి డైలాగ్ కూడా వినిపిస్తోంది. "వాళ్ల నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమేనని తెలిసి కూడా మన పార్టీలో చేరారు" అన్న లోకేశ్ పాత్రధారి డైలాగ్ ఉంది. ఈ ట్రయిలర్ ను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం విడుదల చేశారు. నిమిషాల వ్యవధిలో దీనికి వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది.
Kammarajyamlo Kadapa Redlu
Trailer
Varma
Ramgopal Varma

More Telugu News