Vijay Devarakonda: శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఖాయమైనట్టే!

  • త్వరలో రానున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • తదుపరి సినిమాగా పూరి 'ఫైటర్'
  • 'దిల్'రాజు బ్యానర్లో శివ నిర్వాణ
ప్రేమకథలకు కుటుంబ నేపథ్యాన్ని జోడిస్తూ ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దర్శకుడు శివ నిర్వాణ ఆకట్టుకున్నాడు. 'నిన్నుకోరి' .. 'మజిలీ' సినిమాలు అందుకు ఉదాహరణలు. ఆయన తాజా చిత్రం నాని హీరోగా ఉండనుంది. ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండతో చేయనున్నట్టు సమాచారం.

పూరి జగన్నాథ్ తో 'ఫైటర్' సినిమా చేసిన తరువాత, శివ నిర్వాణతో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి 'ఫైటర్' తరువాత 'హీరో' సినిమాను విజయ్ దేవరకొండ పూర్తిచేయవలసి వుంది. కానీ శివ నిర్వాణ సినిమా తరువాతనే 'హీరో'పై దృష్టిపెట్టాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.
Vijay Devarakonda
Shiva Nirvana
Dil Raju

More Telugu News