Congress: అనివార్య కారణాలతో 'భారత్ బచావో' ర్యాలీ వాయిదా: కాంగ్రెస్

  • ఈ నెల 30న జరగాల్సిన ర్యాలీ
  • డిసెంబర్ 14కు వాయిదా
  • వెల్లడించిన కేసీ వేణుగోపాల్
ఈనెల 30న తలపెట్టిన 'భారత్ బచావో ర్యాలీ'ని వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది . అనివార్య కారణాలతో ర్యాలీని వాయిదా వేశామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 14న ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు.

 కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేకిగా మారారని, బీజేపీ ప్రభుత్వ పాలన అడ్డదారిలో నడుస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని తలపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దీన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందునే ర్యాలీని కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుందని తెలుస్తోంది.
Congress
Bharat Bachavo
Rally
Postphone

More Telugu News