Sensex: దూసుకుపోయిన ఎయిర్ టెల్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 186 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 
  • 56 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 8.76 శాతం లాభపడ్డ భారతి ఎయిర్ టెల్

నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186 పాయింట్లు లాభపడి 40,470కి పెరిగింది. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 11,940కి చేరింది. డిసెంబర్ 1 నుంచి ఫోన్ కాల్స్, డేటా టారిఫ్ లను పెంచబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర టెలికాం కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (8.76), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.71), యాక్సిస్ బ్యాంక్ (3.69), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.68), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.86).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (2.66), మహీంద్రా అండ్ మహీంద్రా (2.03), టీసీఎస్ (1.94), టాటా స్టీల్ (1.85), టాటా మోటార్స్ (1.32).

More Telugu News