Tollywood: ‘మీరు ఎప్పుడు తల్లికాబోతున్నారు?’ అన్న నెటిజన్ ప్రశ్నకు సమంత వ్యంగ్యం!

  • ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమంతను ప్రశ్నించిన అభిమాని
  • 2022, ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు బిడ్డకు జన్మనిస్తాన్న సమంత
  • పలు ప్రశ్నలు అడిగిన నెటిజన్లు..వీడియో పోస్ట్ చేసిన సామ్
టాలీవుడ్ జంట నాగచైతన్య-సమంత వివాహం చేసుకుని రెండేళ్లు దాటుతోంది. ఆ జంట తీపికబురు ఎప్పుడు చెబుతారా? అని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదే తరుణంలో సోషల్ మీడియా వేదికగా ‘తల్లి కాబోతున్న సమంత’ అంటూ వదంతులు హల్ చల్ చేశాయి. ఇక, సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు ఇందుకు సంబంధించిన ప్రశ్నలు సమంతను అడగడం, ఆమె తనదైన శైలిలో జవాబులివ్వడం జరిగింది.

 తాజాగా, ఇదే విషయమై ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘మీరు ఎప్పుడు తల్లికాబోతున్నారు?’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. 2022 సంవత్సరంలో ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తానని చెప్పింది. ఈ వీడియోను సమంత షేర్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమంత బదులివ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
Tollywood
Nagachaitanya
Samantha
Instagram

More Telugu News