Vallabhaneni Vamsi: వంశీ ఫిర్యాదు నేపథ్యంలో మూతపడిన పలు వెబ్ సైట్లు..?

  • ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ
  • తనపై టీడీపీ వర్గీయులు విషప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపణ
  • విజయవాడ సీపీకి ఫిర్యాదు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, తనపై కొన్నిరోజులుగా టీడీపీ వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో తన పరువుప్రతిష్టలు దెబ్బతీస్తున్నారంటూ వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, సీబీఎన్ విజన్, రాయలసీమ ప్రైడ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్లు మూతపడ్డాయని, వాటి అడ్మిన్లు ఇంటర్నెట్ నుంచి సైట్లను తొలగించారని వల్లభనేని వంశీకి చెందిన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రోలింగ్ ఓ వార్తా చానల్లో కూడా వచ్చిందని తెలిపారు.


Vallabhaneni Vamsi
Telugudesam
YSRCP
Vijayawada
Police

More Telugu News