YSRCP: విజయసాయిరెడ్డి గారూ! మీ ఫినాయిల్ పత్రిక, టీవీ చేసిన విధ్వంసం మర్చిపోతే ఎలా?: బుద్ధా వెంకన్న

  • మీరు చేసిన తప్పులన్నీ మీరే స్వయంగా ఒప్పుకుంటారు
  • ఇది దేవుడి స్క్రిప్టో లేక యాదృచ్ఛికమో
  • కులాల మధ్య చిచ్చుపెట్టిన సంఘటన మళ్లీ గుర్తుచేశారు!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా చేసిన వరుస ట్వీట్లలో విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. కులం, మతం, ప్రాంతం పేరుతో మీ ఫినాయిల్ పత్రికా, టీవీ ఛానెల్ చేసిన విధ్వంసం మర్చిపోతే ఎలా? అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.

దేవుడి స్క్రిప్టో లేక యాదృచ్ఛికంగా జరుగుతాయో తెలియదు కానీ, ‘విజయసాయిరెడ్డి గారూ, మీరు చేసిన తప్పులు అన్నీ మీరే స్వయంగా ఒప్పుకుంటారు. ట్రైన్లు తగలబెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టిన సంఘటన గుర్తుచేశారు. పంటలు తగులబెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రచ్చ చేసిన అంశం మళ్లీ తెరపైకి తెచ్చారు’ అని విమర్శించారు.
YSRCP
vijayasai reddy
Buddha venkanna
Mlc

More Telugu News