Jerusalem: జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని పెంచిన ఏపీ ప్రభుత్వం

  • జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ క్షేత్రాలకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం పెంపు
  • రూ. 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 60 వేల సాయం
  • ఇతరులకు రూ. 30 వేల ఆర్థిక సాయం
రాష్ట్రంలోని క్రైస్తవులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ క్షేత్రాలకు వెళ్తే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉండే క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి సాయాన్ని రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది.
Jerusalem
Andhra Pradesh
Financial Assistance
Christians

More Telugu News