Uttar Pradesh: చనిపోయిన కూతురు బతికొస్తుందని.. మృతదేహంతో ప్రార్థనలు!

  • అనారోగ్యంతో ఈ నెల 15న మృతి చెందిన బాలిక
  • ప్రార్థనలు చేస్తే బతుకుతుందన్న బంధువులు
  • ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు
అనారోగ్యానికి గురై మృతి చెందిన కుమార్తె బతికి వస్తుందని కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావూ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అరవింద్ వనవాసి అనే వ్యక్తి నాలుగేళ్ల కుమార్తె ఈ నెల 14న అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించడంతో ఆ మరుసటి రోజే ప్రాణాలు విడిచింది. విషయం తెలిసిన బంధువులు.. ప్రార్థనలు చేస్తే చనిపోయిన కుమార్తె బతికి వస్తుందని చెప్పారు.

వారి మాటలపై విశ్వాసంతో వనవాసి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. అయితే, ఇంట్లోంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వనవాసి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
Uttar Pradesh
girl
dead
prayers

More Telugu News