టికెట్ ఇవ్వలేదు కదా.. సీఎంపై పోటీ చేస్తా: ఝార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సరయు రాయ్ ప్రకటన
- ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకు 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా
- సీఎం పోటీచేసే నియోజకవర్గంతో పాటు, నా సొంత నియోజకవర్గంలో.. పోటీచేస్తా
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేసింది. వీటిలో 72 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాల్లో తన పేరు లేకపోవడంతో రాయ్ సీఎంకు వ్యతిరేకంగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు రాయ్ తెలిపారు. తన మద్దతుదారులు తన సొంత నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తారన్నారు. తూర్పు జంషెడ్ పూర్ నియోజకవర్గం ప్రచారంపై దృష్టిని కేంద్రీకరిస్తానని రాయ్ వెల్లడించారు.