అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో చైనా టాప్
- రెండో స్థానంలో భారత్
- విదేశీ విద్యార్థుల మూలంగా అమెరికాకు 44.7 బిలియన్ డాలర్ల ఆదాయం
- ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్చేంజ్ నివేదికలో వెల్లడి
2019 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్చేంజ్’ ప్రపంచ దేశాలనుంచి అమెరికాలోకి వచ్చే విద్యార్థులకు సంబంధించి గణాంకాలతో కూడిన నివేదికను వెలువరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లారని తెలుస్తోంది. వీరిలో 3.69 లక్షల మంది విద్యార్థులు చైనాకు చెందినవారు కాగా, భారత్ నుంచి 2,02,014 మంది విద్యార్థులు ఉన్నారని నివేదిక పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే.. అమెరికాకు వెళ్లిన చైనా విద్యార్థుల సంఖ్య 1.7 శాతం పెరుగగా, భారత విద్యార్థుల సంఖ్య 2.9 శాతం పెరిగిందని వెల్లడైంది. బంగ్లాదేశ్, బ్రెజిల్, నైజీరియా, పాకిస్థాన్ నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని నివేదిక తెలిపింది.