Telangana: టీఎస్ ఆర్టీసీ సమ్మె: కార్మికశాఖ కమిషనర్ కు గడువు విధించిన హైకోర్టు

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • లేబర్ కోర్టుకు వెళ్లాలో, వద్దో నిర్ణయించుకోవాలని లేబర్ కమిషనర్ కు సూచన
  • రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం

తెలంగాణలో గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల జేఏసీ వాదనలు విన్న అనంతరం కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ, సమ్మెపై లేబర్ కోర్టుకు వెళ్లాలో, వద్దో రెండు వారాల్లో ఓ నిర్ణయం తీసుకోవాలంటూ లేబర్ కమిషనర్ ను ఆదేశించింది. సమ్మె అక్రమమో, సక్రమమో నిర్ణయం తీసుకోగలిగే విచక్షణాధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, అందుకే చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

More Telugu News