Jagan: సతీసమేతంగా గవర్నర్ ను కలిసిన సీఎం జగన్... రాజ్ భవన్ లో లంచ్ మీటింగ్

  • గవర్నర్ తో భేటీ 
  • దాదాపు గంటకు పైగా చర్చ
  • రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించిన సీఎం జగన్
రాజ్ భవన్ లో  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్ధితులను గవర్నర్ హరిచందన్ కు వివరించిన సిఎం, అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్దం గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా రాజ్ భవన్లో భోజన ఏర్పాట్లు చేయించారు. తొలుత రాజ్ భవన్ లో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించారు.

గవర్నర్ శాలువా, మెమెంటోలతో సిఎంను గౌరవించగా, ముఖ్యమంత్రి సైతం అదే తీరుగా గవర్నర్ ను సత్కరించారు. సిఎం వెంబడి ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
Jagan
Governor
Andhra Pradesh
YSRCP

More Telugu News