Sanjay Raut: డిసెంబరు మొదటి వారంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు: సంజయ్ రౌత్

  • ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివసేన నేత సంజయ్ రౌత్
  • శివసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది
  • 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది

డిసెంబరు మొదటి వారంలో మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. తమ ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్ల పాటు పాలన కొనసాగిస్తుందని చెప్పారు.

కాగా, మహారాష్ట్రలో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీల్లో కలిపి మొత్తం 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని సంజయ్ రౌత్ అంటున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి ఈ రోజు  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

More Telugu News