Jagan: సీఎం జగన్ గారికి అభినందనలు: సినీనటుడు రాజశేఖర్

  • ఇసుక సమస్యపై జగన్ చర్యలపై రాజశేఖర్ స్పందన
  • ప్రభుత్వ మార్గదర్శకాలను ఇప్పుడు ప్రజలు పాటించాలి
  • ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజలు సహకరించాలి
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక రవాణాలో అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు సీఎం జగన్ ఈ రోజు 14500 టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణా, నిల్వల నిరోధానికి ఆయన చేపడుతోన్న చర్యలపై సినీనటుడు రాజశేఖర్ స్పందించారు.  

'ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాను అంతమొందించేందుకు గొప్ప పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చిన జగన్ గారికి అభినందనలు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజలు సహకారం అందించాల్సి ఉంది' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు. కాగా, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 
Jagan
rajashekar
Andhra Pradesh
YSRCP

More Telugu News