George Reddy Movie: 'జార్జిరెడ్డి' సినిమాపై వివాదం.. 'సినిమాను నిషేధించాలి' అంటూ ఏబీవీపీ డిమాండ్

  • వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి జార్జి రెడ్డి
  • సినిమాలో ఏబీవీపీని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి
  • నిజానిజాలను సెన్సార్ బోర్డు పరిశీలించాలి

'జార్జిరెడ్డి' సినిమాపై వివాదం నెలకొంది. విద్యార్థి నేత అయిన జార్జిరెడ్డి జీవితకథతో తెరకెక్కిన ఈ సినిమాపై ఏబీవీపీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి జార్జిరెడ్డి అని ఆరోపించింది. సినిమాలో ఏబీవీపీని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. నిజానిజాలను సెన్సార్ బోర్డు పరిశీలించాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శ్రీశైలం కోరారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదలకానుంది.

More Telugu News