rajbhavan: రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమైన జగన్ దంపతులు

  • సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై జగన్ చర్చ
  • సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న సమావేశం
  • జగన్ దంపతుల గౌరవార్థం రాజ్ భవన్ లో భోజన ఏర్పాట్లు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్ చేరుకొని గవర్నర్ బిశ్వభూషణ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలపై గవర్నర్ తో సుమారు 45 నిమిషాల పాటు జగన్ చర్చించనున్నారు.

అలాగే, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను గవర్నర్ కు జగన్ వివరిస్తున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా గవర్నర్ కు జగన్ తెలిపినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ దంపతుల గౌరవార్థం రాజ్ భవన్ అధికారులు వారికి భోజన ఏర్పాట్లు చేశారు.
rajbhavan
Andhra Pradesh
Jagan

More Telugu News