Chandrababu: చంద్రబాబు ఏలూరు పర్యటన.. 20 మంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
  • నేడు తణుకులో టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
  • ఆంక్షలు విధించిన పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు తణుకులోని భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కల్యాణమంటపంలో టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పోలీసులు ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20 మంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని, ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం ఏలూరు సమీపంలో ఉన్న దుగ్గిరాలకు చంద్రబాబు రానున్నారు.

Chandrababu
West Godavari District
Telugudesam

More Telugu News