Vijay: విజయ్ మూవీపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్

  • 'ఖైదీ'తో కార్తీకి హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ 
  • తదుపరి సినిమా కోసం విజయ్ తో సెట్స్ పైకి 
  •  పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన లోకేశ్ కనగరాజ్
తమిళనాట వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విజిల్' తమిళనాట భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లాడు. రీసెంట్ గా లోకేశ్ కనగరాజ్ .. హీరో కార్తీకి 'ఖైదీ' సినిమాతో తిరుగులేని హిట్ ఇచ్చాడు. అందువలన అందరిలోను విజయ్ న్యూ మూవీపై భారీ అంచనాలే వున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం ఊపందుకుంది. దాంతో ఇది ఏ సినిమా రీమేక్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ విషయపై లోకేశ్ కనగరాజ్ స్పందిస్తూ, ఇది ఏ సినిమాకి రీమేక్ కాదనీ .. తను తయారు చేసిన ఒరిజినల్ కథ అని చెప్పాడు. ఈ విషయంలో పుకార్లను నమ్మవద్దంటూ తన వైపు నుంచి స్పష్టత ఇచ్చాడు.
Vijay
Lokesh kanagaraj

More Telugu News