Agra: మారబోతున్న ఆగ్రా నగరం పేరు.. సాక్ష్యాల కోసం చరిత్రను తవ్వితీస్తున్న అంబేద్కర్ వర్సిటీ

  • ఉత్తరప్రదేశ్‌లో పేరు మార్చుకోనున్న మరో నగరం
  • అగ్రవాన్‌గా మార్చాలని నిర్ణయం
  • మహాభారత కాలంలో ఆగ్రాను అగ్రవాన్‌గా పిలిచేవారన్న ప్రొఫెసర్ ఆనంద్

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. తాజాగా, తాజ్‌మహల్ కొలువైన ఆగ్రా నగరం పేరును మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆగ్రా పేరును ‘అగ్రవాన్’గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగా చరిత్రను తవ్వి తీస్తోంది. ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. ఆగ్రాకు తొలుత అగ్రవాన్ అనే పేరు ఉండేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహాభారత కాలంలో ఈ నగరాన్ని అగ్రవాన్, అగ్రబాణ్‌గా పిలిచేవారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్టు ప్రొఫెసర్ ఆనంద్ తెలిపారు.

More Telugu News