Kollu Ravindra: అడ్రస్ లేని వ్యక్తులు, అమ్ముడుపోయిన వ్యక్తులతో మాట్లాడిస్తారా?: సీఎం జగన్ పై కొల్లు రవీంద్ర విసుర్లు

  • సమస్యలను పక్కదారి పట్టించే యత్నాలని విమర్శలు
  • చంద్రబాబు గురించే మాట్లాడే అర్హత ఒక్కరికైనా ఉందా అన్న కొల్లు
  • లోకేశ్ పై విమర్శలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిక
రాష్ట్రంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. మంత్రులు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని, వాళ్లలో ఎవరికైనా చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. అడ్రస్ లేని వ్యక్తులు, అమ్ముడుపోయిన వ్యక్తులతో మాట్లాడిస్తారా? అంటూ నిలదీశారు. లోకేశ్ అనేక ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చాడని, ఇంకోసారి లోకేశ్ గురించి అవాకులు చెవాకులు పేలితే కేసులు పెడతామని, చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని హెచ్చరించారు.
Kollu Ravindra
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu

More Telugu News