Amazon Prime: అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పై నిర్మాత సురేశ్ బాబు వ్యాఖ్యలు!

  • అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమాలు
  • చిన్న సినిమాలకు థియేటర్లలో ఆదరణ తగ్గిందన్న సురేశ్ బాబు
  • డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టపోతున్నారని వ్యాఖ్యలు
ఇది సోషల్ మీడియా యుగం. స్మార్ట్ ఫోన్ సాయంతో ప్రపంచం అరచేతిలో ప్రత్యక్షమవుతున్న ఈ రోజుల్లో సినిమా ప్రదర్శన అనేది కొత్తరూపం సంతరించుకుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి కంటెంట్ ప్లాట్ ఫామ్ ల రంగప్రవేశంతో యూజర్లు ఎక్కడికీ వెళ్లకుండానే వినోదం లభ్యమవుతోంది. కొత్త సినిమాలు కూడా స్మార్ట్ ఫోన్లలో ప్రదర్శితమవుతున్నాయి. అయితే, ఈ తరహా ప్లాట్ ఫామ్స్ చిన్న సినిమాలు, థియేటర్లపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని, ఏవో కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తున్నారని సురేశ్ బాబు పేర్కొన్నారు. మధ్యస్థ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఏమంత ఆసక్తి చూపడంలేదని, థియేటర్ యాజమాన్యాలు కనీసం ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టాలపాలయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు.
Amazon Prime
Netflix
Suresh Babu
Tollywood

More Telugu News